: ఆర్జేడీ నేతను చావగొట్టిన జార్ఖండ్ ఆరోగ్య మంత్రి... హల్ చల్ చేస్తున్న వీడియో
నలుగురూ చూస్తుండగా, నడిరోడ్డుపై రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నేతను చితక్కొట్టి, తన బాడీగార్డుల చేత కూడా కొట్టించి మరో వివాదానికి తెరలేపారు జార్ఖండ్ ఆరోగ్య మంత్రి, సీనియర్ బీజేపీ నేత రామచంద్ర చంద్రవంశీ. ఈ ఘటన పలాము జిల్లాలో, చంద్రవంశీ కులానికి చెందిన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ సభలో జరిగింది. ఈ కుల సంఘానికి ప్రస్తుతం ఆర్జేడీ నేత అధ్యక్షుడిగా ఉన్నారు. వేదికపై తనను తిట్టారని ఆరోపిస్తూ, చంద్రవంశీ ఆ నేతపై పిడిగుద్దులు గుద్దారు. తన బాడీగార్డులతో కొట్టించారు. ఇదంతా వీడియోలో రికార్డయింది. కాగా, ఆయన చంద్రవంశీని తిట్టినట్టు మాత్రం ఈ వీడియోలో ఎక్కడా కనిపించక పోవడం గమనార్హం. ఈ ఘటనపై ఆర్జేడీ రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది.