: స్టీఫెనే ఓటేస్తానని వచ్చాడు: టీడీపీ నేత పెద్దిరెడ్డి


టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తనకు అసంతృప్తి ఉందని నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్ చెప్పారని టీడీపీ నేత పెద్డిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు స్టీఫెన్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి వెళ్లారని ఆయన అన్నారు. స్టీఫెన్‌ తో మాట్లాడుతుంటే ఏదో నేరం చేసినట్టుగా పోలీసులు రేవంత్‌ రెడ్డిని అరెస్ట్ చేశారని పెద్దిరెడ్డి ఆరోపించారు. రేవంత్‌ రెడ్డిని చంపడానికి అరెస్ట్ చేశారా? అని ఆయన ప్రశ్నించారు. తమకు బలం లేదని తెలిసినా సీఎం కేసీఆర్‌ ఐదో అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబెట్టారని విమర్శించారు. రేవంత్‌ రెడ్డిని వెంటనే విడిచిపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

  • Loading...

More Telugu News