: డీజీపీతో భేటీ అయిన టీటీడీపీ నేతలు


టీడీపీ ఎమ్మెల్యేను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారన్న నేపథ్యంలో, టీటీడీపీ నేతలు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మతో భేటీ అయ్యారు. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావుతో పాటు, ఇతర నేతలు డీజీపీతో సమావేశమయ్యారు. తమ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కావాలనే ఈ కేసులో ఇరికించారని వారు డీజీపీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి వద్ద ఎలాంటి డబ్బు దొరకలేదని డీజీపీకి తెలిపారు. వీరి సమావేశం ఇంకా కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News