: రేవంత్ రెడ్డి అరెస్ట్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ?


తెలంగాణలో టీడీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ కు డబ్బులు ఇవ్వబోతుండగా రేవంత్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు సమాచారం. గత రెండు రోజుల నుంచి స్టీఫెన్ తో రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఏసీబీకి, ఇంటెలిజెన్స్ అధికారులకు స్టీఫెన్ ఎప్పటికప్పుడు సమాచారం అందించారని సమాచారం. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, విషయం చాలా సెన్సిటివ్ కావడంతో... ఇప్పటి వరకు దీనిపై పోలీసు అధికారుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు, అలాంటిదేమీ జరగలేదని టీడీపీ నేతలు అంటున్నారు.

  • Loading...

More Telugu News