: టీఆర్ఎస్ కు మద్దతు తాత్కాలికమే... ఎన్నికల తర్వాత ఆ పార్టీపై పోరాటం చేస్తాం: అంబటి
ఏపీలో ఒక మాట, తెలంగాణలో మరో మాట చెబుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు చెప్పిన గొర్రె కథను ఆయనకే అన్వయించుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. టీడీపీ రాక్షస చర్యలను అడ్డుకోవడానికి వైకాపా విష్ణుమూర్తి అవతారం ఎత్తుతుందని అన్నారు. రాజధాని పేరుతో పచ్చని భూములను చంద్రబాబు ఆక్రమిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో తాము టీఆర్ఎస్ కు ఇస్తున్న మద్దతు తాత్కాలికమే అని అంబటి తెలిపారు. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పై పోరాటం చేస్తామని చెప్పారు. తమ ఎమ్మెల్యేలను లాక్కున్న టీఆర్ఎస్ ను ఊరికే వదిలిపెట్టమని హెచ్చరించారు.