: టీడీపీ, కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పేందుకే టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నాం: టి.వైకాపా


రేపు జరగనున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వైకాపా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాము టీఆర్ఎస్ కు ఎందుకు మద్దతిస్తున్నామో తెలంగాణ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. కేవలం టీడీపీ, కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పేందుకే తాము టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నామని చెప్పారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి టీడీపీ సహకరించిందని అన్నారు. దీంతో, విలువలు లేని పార్టీలకు మద్దతు ఇవ్వాలని తాము అనుకోలేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News