: మాధవరెడ్డి కూడా మాధవరం బాటపట్టనున్నారా?
టీఆర్ఎస్ లోకి వలసల వెల్లువ ఆగడం లేదు. టీఆర్ఎస్ చేపట్టిన ఆకర్ష్ పథకం సత్ఫలితాలు ఇస్తోంది. కూకట్ పల్లి ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడంతో రెట్టించిన ఉత్సాహంతో టీఆర్ఎస్ నేతలు మరికొంత మందికి గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వల విసిరింది. అయితే మంత్రి పదవి ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలం పెరగాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు మరి కొంత మందిని పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అయితే దొంతి మాధవరెడ్డి కూకట్ పల్లి ఎమ్మెల్యే బాటలో నడుస్తారా? లేదా? అనేది త్వరలోనే తేలిపోనుంది.