: సైనా ఓటమికి ఇండియన్ రెస్టారెంట్ కారణమట
భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ను ఇండియన్ రెస్టారెంట్ ఓటమిపాలు చేసిందని ఆమె కోచ్ విమల్ కుమార్ ఆరోపించారు. ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ క్వార్టర్ ఫైనల్ లో చైనా క్రీడాకారిణి షిజియాన్ వాంగ్ చేతిలో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ సైనా పరాజయం పాలైంది. సిడ్నీలోని ఓ భారత రెస్టారెంట్ లో భోజనం చేయడం సైనా ఆటపై ప్రభావం చూపిందని కోచ్ విమల్ కుమార్ చెప్పారు. ఆహారం బాగాలేదని, దాని వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి సైనా కోర్టులో సరిగ్గా కదలలేకపోయిందని, ఫలితంగా పరాజయం పాలైందని ఆయన పేర్కొన్నారు.