: బంతి అంత బలంగా తాకినా...అదృష్టమే ఇలా ఉంచింది: సునీల్ గవాస్కర్
కెరీర్ లో అదృష్టం ప్రధాన పాత్ర పోషించిందని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. టీమిండియా మాజీ ఓపెనర్ మాధవ్ ఆప్టే జీవితం ఆధారంగా రాస్తున్న 'యాజ్ లక్ వుడ్ హేవ్ ఇట్' పుస్తకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన జ్ఞాపకాల దొంతరల్లోకి వెళ్లారు. తాను క్రికెట్ కెరీర్ ను ఆరంభించిన తొలినాళ్లలో అదృష్టమే తనను కాపాడిందని గవాస్కర్ చెప్పారు. 1971లో వెస్టిండీస్ పర్యటన తనకు చేదు జ్ఞాపకాలు మిగిల్చిందని ఆయన పేర్కొన్నారు. ఆ సిరీస్ లోని ఒక టెస్ట్ మ్యాచ్ లో తాను కొట్టిన షాట్ కు పరుగు తీస్తుండగా, విండీస్ ఆటగాడు గ్యారీ సోబర్స్ ఫీల్డింగ్ చేస్తూ విసిరిన బంతి తన ఛాతిపై బలంగా తాకి గ్రౌండ్ లో పడిపోయానని చెప్పారు. ఆ నొప్పితోనే హాఫ్ సెంచరీ చేశానని గుర్తు చేసుకున్నారు. అలా జరిగినా తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అదృష్టమేనని ఆయన పేర్కొన్నారు.