: బాబుకు ఆమాత్రం పరిజ్ఞానం లేదా?: చెవిరెడ్డి


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి కనీస పరిజ్ఞానం కూడా లేదని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జాతీయ పార్టీ నిబంధనలు తెలియకుండానే బాబు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఆరు శాతం ఓట్లు వచ్చిన పార్టీనే జాతీయ పార్టీగా గుర్తిస్తారన్న ఎన్నికల కమిషన్ నిబంధన టీడీపీ అధినేతకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడు పదవి కంటే టీడీపీ అంతర్జాతీయ అధ్యక్షుడిగా బాబు ప్రకటించుకుంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడంలో బాబుకు భారతరత్న ప్రదానం చేయచ్చని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

  • Loading...

More Telugu News