: మరోసారి భూ ఆర్డినెన్స్ జారీకి కేంద్ర కేబినెట్ సిఫారసు
భూ సేకరణ చట్ట సవరణలపై మరోసారి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫారసు పంపాలని కేంద్ర కేబినెట్ తీర్మానించింది. ఢిల్లీలోని సెవన్ రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న ప్రధానమంత్రి నివాసంలో మోదీ అధ్యక్షతన ఈరోజు కేబినెట్ భేటీ జరిగింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బిల్లుపై రెండుసార్లు ఆర్డినెన్స్ జారీ అయ్యాయి. రెండు సందర్భాల్లోనూ ఆ బిల్లు రాజ్యసభలో వీగిపోయింది. ఆర్డినెన్స్ కు సంబంధించిన గడువు జూన్ 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆర్డినెన్స్ తేవాలని కేంద్ర సర్కార్ ఆలోచించింది.