: దొంగలు దొంగల పార్టీల్లోనే చేరుతారు: ఆనం


దొంగలు ఎప్పుడూ దొంగల పార్టీలోనే చేరుతారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వచ్చిన వార్తలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. వైకాపాలోకి బొత్స వెళ్లాలని భావించడం దురదృష్టకరమన్న ఆయన, అంతకన్నా ద్రోహం మరొకటి లేదని విమర్శించారు. బొత్స దొంగ కాబట్టే మరో దొంగ ప్రారంభించిన పార్టీలోకి వెళ్లాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. జగన్ తో ఉంటే ఎప్పటికైనా బొత్స సత్యనారాయణ కూడా జైలుకు వెళ్లి తీరతాడని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News