: మా పార్టీ ఎంపీల నిధుల విషయంలో ఏపీ సర్కార్ రాజకీయాలు చేస్తోంది: వైవి.సుబ్బారెడ్డి


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల నిధుల విషయంలో ఏపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డి ఆరోపించారు. ఎంపీలు నిధులు మంజూరు చేసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు పనులు మొదలుపెట్టడం లేదన్నారు. ఇది కచ్చితంగా రాజకీయ దురుద్దేశమేనని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు సుబ్బారెడ్డి ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇదే కుట్ర జరుగుతోందని చెప్పారు. ఎంపీలాడ్స్ నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని, దానిపై కేంద్రానికి ఫిర్యాదుచేసి దర్యాప్తు కోరతామని తెలిపారు.

  • Loading...

More Telugu News