: అనంతలో బీభత్సం సృష్టించిన హోరుగాలి
హోరుగాలి అనంతపురం జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లా అంతటా 100 నుంచి 120 కి.మీ. వేగంతో వీచిన గాలులకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పదుల సంఖ్యలో రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్ కు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ఈ ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసినట్టు సమాచారం. ధర్మవరం సమీపంలో పిడుగు పడి ఒకరు మృతి చెందినట్టు తెలుస్తోంది.