: టి.కాంగ్రెస్ ను కలవరపెడుతున్న పువ్వాడ


ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పట్టుకుంది. దీనికి కారణం ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదో స్థానానికి కూడా తమ అభ్యర్థిని పోటీకి నిలిపి... కాంగ్రెస్ పార్టీలో గుబులు రేకెత్తిస్తోంది టీఆర్ఎస్. ఈ క్రమంలో ప్రతి ఓటు కూడా కాంగ్రెస్ కు కీలకమే. ఈ నేపథ్యంలో, అమెరికా నుంచి రావాలని పువ్వాడకు కాంగ్రెస్ దూత అజాద్ ఫోన్ లో చెప్పినట్టు తెలుస్తోంది. తమకు ఇండియా రావడానికి టికెట్ దొరకలేదని చెప్పగా... కనీసం మీరొక్కరైనా అమెరికా నుంచి రావాలని కోరారు. మరోవైపు, 18 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసినా గెలిచే అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ సభ్యులకు విప్ జారీ చేసింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ అయింది.

  • Loading...

More Telugu News