: ముతూట్ దొంగలు సినీ, టీవీ నటులట!


హైదరాబాదు కూకట్ పల్లిలోని ముతూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీకి యత్నించిన దుండగులను సీసీ టీవీ కెమెరాల సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సినిమాలు, టీవీ సీరియళ్లలో నటిస్తున్న జూనియర్ ఆర్టిస్టులని తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. ముతూట్ కార్యాలయంలోని సీసీటీవీ దృశ్యాల హార్డ్ డిస్క్ ను వీరు తీసుకుపోయినప్పటికీ, సమీపంలోని చర్మాస్, వరుణ్ మోటార్స్ నిర్వాహకులు బయట ఏర్పాటు చేసుకున్న సీసీటీవీల్లో వీరి చిత్రాలు రికార్డు అయ్యాయి. మొత్తం ఐదుగురు దోపిడీ యత్నం చేయగా, అందులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతావారి కోసం గాలింపు చేపట్టారు. అందరూ దొరికిన తరువాత, నేటి సాయంత్రం లేదా రేపు నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెట్టి, ఆపై కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. వీరి పేర్లు, వివరాలు సైతం మీడియా సమావేశంలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News