: వందమంది ఒక్కటై డబుల్‌ డెక్కర్ బస్సును ఎత్తినవేళ!


ఐకమత్యమే మహాబలం. నలుగురు కలిస్తే సాధించలేనిదేమీ లేదు. ఈ విషయం అందరూ ఒప్పుకునేదే. దీనికి తాజా ఉదాహరణే ఈ ఘటన. ఈస్ట్ లండన్ లోని వాల్తమ్ స్టౌ ప్రాంతంలో నిత్యమూ రద్దీగా ఉండే హోయె వీధిలో ఓ వయసు మళ్లిన వ్యక్తి సైకిల్ పై వస్తూ, ప్రమాదవశాత్తూ ఓ డబుల్ డెక్కర్ బస్సు కింద పడిపోయాడు. బస్సు కింద నుంచి అతను బయటకు రాలేకపోయాడు. పక్కనే ఉన్న రెస్టారెంటులో ఉన్న వాళ్లు ఈ ఘటన చూసి వెంటనే స్పందించారు. వారంతా బయటకు వచ్చి తలా ఒక చెయ్యి వెయ్యడంతో సునాయాసంగా బస్సు పైకి లేచింది. ఆ వృద్ధుడి ప్రాణాలు దక్కాయి.

  • Loading...

More Telugu News