: రైల్లో ఒడిశా వాసుల తీరు ఇలాగే ఉంటుంది
రైలులో ఒడిశా ప్రాంత వాసుల వ్యవహార శైలిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఒడిశాలో టీసీలు తనిఖీలు చేయరని, గట్టిగా అడిగితే ప్రయాణికులు వారిని కదులుతున్న రైల్లోంచి తోసేసిన సంఘటనలు ఉన్నాయని శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల్లో చెప్పుకుంటూ వుంటారు. అలాంటి ఆరోపణలను బలపరిచే ఘటన వరంగల్ జిల్లా కాజీపేటలో చోటుచేసుకుంది. సికింద్రాబాదు నుంచి బిలాస్ పూర్ వెళ్తున్న రైలులోంచి ఓ వ్యక్తిని ఒడిశా వాసులు బయటికి తోసేసిన ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న రైల్లోంచి కిందపడడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.