: భార్య సహా పారిస్ లో వాలిపోయిన రైనా


టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా షెడ్యూల్ ఫుల్ బిజీగా కొనసాగుతోంది. నిశ్చితార్థం చేసుకోగానే ఆస్ట్రేలియా సిరీస్, అది కాస్తా ముగిసిందో లేదో వరల్డ్ కప్ ప్రారంభమైంది. అది ముగియగానే వివాహం చేసుకున్న రైనా, ఐపీఎల్ లో ఆడేందుకు వెళ్లిపోయాడు. ఐపీఎల్ ముగిసింది, మరి కొద్ది రోజుల్లో బంగ్లాదేశ్ తో సిరీస్ ప్రారంభం కానుంది. ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదని ఐపీఎల్ ముగియగానే భార్యతో హనీమూన్ కు చెక్కేశాడు. భార్య ప్రియాంకాతో కలిసి పారిస్ లో విహరిస్తున్నాడు. భార్యాభర్తలు ఆనందంగా ఉన్న సమయంలో దిగిన కొన్ని ఫోటోలను రైనా ట్విట్టర్లో పోస్టు చేశాడు.

  • Loading...

More Telugu News