: నేను కుందేలులా బ్యాటింగ్ చేస్తానట: బ్రెట్ లీ


క్రికెట్ ఆటలో స్లెడ్జింగ్ అంటే ఆస్ట్రేలియన్లే గుర్తుకువస్తారు. ఆటగాడిని క్రీజులో కుదురుకోనివ్వకుండా చేసేందుకు వారు పేల్చే మాటల తూటాలు ఎన్నోసార్లు వివాదాస్పదమయ్యాయి. క్రికెటింగ్ టాలెంటే కాకుండా కాస్తో కూస్తో స్లెడ్జింగ్ ప్రతిభ ఉన్నవారినే ఆసీస్ జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది కూడా. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు... ఆసీస్ క్రికెట్ సంస్కృతిలో మాటలయుద్ధానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో! అంతటి ఆస్ట్రేలియన్లూ స్లెడ్జింగ్ బాధలు పడ్డవారేనట. దీనిపై బ్రెట్ లీ ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలు పంచుకున్నాడు. "స్లెడ్జింగ్ పట్ల నాకో నిర్దిష్ట అభిప్రాయం ఉంది. ఆటలో మాటల యుద్ధానిది చాలా పెద్ద పాత్ర. అయితే, ఆటగాళ్లను హద్దులు దాటేందుకు అనుమతించరాదు. జాతి, వర్ణ వివక్ష వ్యాఖ్యలు మాత్రం చేయకూడదు. ఇక, మైదానంలో స్లెడ్జింగ్ అంటే అత్యధిక శాతం నవ్వు తెప్పించే విధంగానే ఉంటుంది. భారత ఆటగాళ్లు మైదానంలో నా గురించి ఏం మాట్లాడుకుంటారో తెలుసుకునేందుకే కాస్త హిందీ నేర్చుకున్నాను. నేనో 'ఖర్గోష్' (కుందేలు)లా బ్యాటింగ్ చేస్తానని అన్నారు. చూడండి! ఎంత తమాషానో. నేను కుందేలులా ఆడతానట!" అని వివరించాడు.

  • Loading...

More Telugu News