: ఆ మాటలు వింటే చాలు... రక్తం ఉప్పొంగుతుంది: బాలకృష్ణ


నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మహానాడులో ప్రసంగించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవం అనంతరం బాలయ్య మాట్లాడుతూ... పార్టీ జాతీయ స్థాయికి ఎదగడం వెనుక చంద్రబాబు కృషి ఉందని తెలిపారు. దేశ రాజకీయాల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. దేశమంతా కాంగ్రెస్ హవా నెలకొన్న సమయంలోనూ, ఇక్కడ మాత్రం ప్రజలు టీడీపీకి ఎన్నో సీట్లు సాధించిపెట్టి లోక్ సభలో ప్రతిపక్ష హోదా కల్పించారన్నారు. తెలుగుదేశం జాతీయ పార్టీ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక, 'ఎన్టీఆర్', 'తెలుగు'... ఈ రెండు మాటలు వింటుంటే రక్తం ఉప్పొంగుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News