: జమ్ము కాశ్మీర్ లో మరోసారి పాక్ జెండాల ప్రదర్శన
జమ్ము కాశ్మీర్ లో మరోసారి పాకిస్థాన్ జెండాలు ప్రదర్శితమయ్యాయి. కాశ్మీర్ భూభాగంపై పాక్ జెండాలను ప్రదర్శించడంగానీ, ఎగుర వెయ్యటంగానీ చేస్తే సహించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రెండు రోజుల కిందట హెచ్చరించారు. అయినప్పటికీ ఈరోజు మళ్లీ అనంత్ నాగ్ జిల్లాలో వేర్పాటువాద నేత షబ్బీర్ అహ్మద్ షా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాక్ జెండాలను ప్రదర్శించారు. ఈ ర్యాలీలో భారత్ కు వ్యతిరేకంగా వేర్పాటవాద నేతలు ఉపన్యాసం కూడా చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ నియోజకవర్గమే ఈ అనంతనాగ్.