: జగన్ కు కేటీఆర్ ఫోన్ చేయడమే అందుకు నిదర్శనం: రావుల


హైదరాబాదులోని గండిపేటలో జరుగుతున్న మహానాడులో తెలంగాణ ప్రాంత నేత రావుల చంద్రశేఖరరెడ్డి కూడా మాట్లాడారు. కేటీఆర్, జగన్ లపై ఆయన ధ్వజమెత్తారు. టీడీపీని లక్ష్యంగా చేసుకునే వారిద్దరూ చేతులు కలిపారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వాలంటూ జగన్ కు కేటీఆర్ ఫోన్ చేయడమే అందుకు నిదర్శనమని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ మిత్రపక్షాలని ఆరోపించారు. ఇక, టీడీపీ తెలుగువాళ్ల పార్టీ అని, అందరి పార్టీ అని స్పష్టం చేశారు. ఆంధ్రా పార్టీ ముద్ర సరికాదని అన్నారు. పనిలోపనిగా కేసీఆర్ నూ ప్రస్తావించారు. ఉస్మానియా యూనివర్శిటీ భూములను తీసుకుంటామని కేసీఆర్ పేర్కొనడాన్ని రావుల తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News