: జయ ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తున్నారు: అన్నా డీఎంకే ధ్రువీకరణ


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆర్ కే నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్టు ఏఐఏడీఎంకే అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జూన్ 27న ఉపఎన్నిక జరగనుండగా, 30న కౌంటింగ్ జరుగుతుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు వెలువడక ముందు జయ 'శ్రీరంగం' నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేసులో దోషిగా రుజువై, శిక్షపడిన తరువాత జయ ఎమ్మెల్యేగా అనర్హతకు గురయ్యారు. అయితే కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన జయ వారం కిందట సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

  • Loading...

More Telugu News