: ఆయనను మాత్రమే పిలవలేదు... రాహుల్ విమర్శలపై పీఎంవో దిద్దుబాటు చర్యలు


చేతులు కాలాక పీఎంవో ఆకులు పట్టుకుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలతో, ఒక రోజు తరువాత మేలుకున్న పీఎంవో, ప్రధాని మోదీని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారని ప్రకటించింది. ప్రధానితో భేటీకి మాజీ ప్రధానులందర్నీ ఆహ్వానించామని పీఎంఓ పేర్కొంది. అయితే మన్మోహన్ సింగ్ ఒక్కరే ప్రధానిని కలిశారని వారు వివరించారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను కూడా ఆహ్వానించినప్పటికీ బెంగళూరులో ఓ సమావేశం ఉండడంతో రాలేకపోతున్నానని ఆయన చెప్పారని పీఎంవో ప్రకటించింది. సమయం కుదిరినప్పుడు మోదీని కలవాల్సిందిగా పీఎం ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్రా స్వయంగా ఫోన్ లో ఆహ్వానించారని పీఎంవో తెలిపింది.

  • Loading...

More Telugu News