: రాక్షస గుణాలు, రాక్షస స్వభావం చంద్రబాబువే: వైకాపా
రాజధాని కోసం ఇప్పటికే 33 వేల ఎకరాల భూమిని సమీకరించారని, ఇంకా అదనంగా భూసేకరణ ఎందుకు చేస్తున్నారని టీడీపీ ప్రభుత్వాన్ని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో రైతులకు కోర్టుకు వెళ్లే హక్కు ఉందని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణం వైకాపాకు ఇష్టం లేదని ఆ పార్టీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని చంద్రబాబు అనడాన్ని ఆయన తప్పుబట్టారు. రాక్షస గుణాలు, రాక్షస స్వభావం అనేవి చంద్రబాబుకే సొంతమని విమర్శించారు. ఏడాది పాలనలో ఏమీ చేయకలేకపోయామనే నిస్పృహతోనే చంద్రబాబు అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.