: కామాంధుడిగా మారిన టీచరుకు ఉరిశిక్ష
కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థినుల పట్ల కామాంధుడిగా మారి కాటేసిన ఓ టీచరును చైనా ఉరితీసి చంపింది. చైనా లోని గాస్సు ప్రావిన్స్ లోని టియాన్ షుయ్ నగరంలో లీ జిషున్ అనే వ్యక్తికి మరణ శిక్ష అమలు చేశారని స్థానిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ దుర్మార్గుడు తన వద్దకు విద్యాభ్యాసం నిమిత్తం వచ్చిన 4 సంత్సరాల నుండి 11 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయిలపై కన్నేసి, పాఠశాల గదులు, హాస్టళ్లు, కారిడార్లలో లైంగిక దాడులు చేశాడు. 2011 నుండి 2012 మద్య కాలంలో లీ ఈ దారుణాలకు పాల్పడ్డాడు. కేసు విచారించిన న్యాయమూర్తి "లీ ఈ లోకంలో బతికేందుకు అనర్హుడు" అని వ్యాఖ్యానించడం కేసు తీవ్రతను తెలుపుతోంది. అమ్మాయిలను రేప్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని, ఇతనికి వెంటనే మరణ శిక్ష అమలు చెయ్యాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థినులతో ఈ విధంగా ప్రవర్తించే టీచర్లకు ఇదే గతిపడుతుందని ఆయన హెచ్చరించారు.