: గోదావరి ఒడ్డున ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టించబోతున్నాం: చంద్రబాబు


తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలను ఘనంగా జరపాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీలో గోదావరి పుష్కరాల పనులు వేగంగా జరుగుతున్నాయని, పుష్కరాలకోసం 268 ఘాట్లలో 248 పుష్కర ఘాట్ లను సిద్ధం చేశామని చెప్పారు. వసతుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని, నాణ్యతా లోపాలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. మూడవ రోజు జరుగుతున్న మహానాడులో చంద్రబాబు గోదావరి పుష్కరాలపై మాట్లాడారు. గోదావరి ఒడ్డున శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించారు. పవిత్ర గోదావరిని సంరక్షించుకోవల్సిన బాధ్యత అందిరిపై ఉందన్న చంద్రబాబు, నదుల అనుసంధానంతో రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు.

  • Loading...

More Telugu News