: న్యూఢిల్లీ ఎయిర్ పోర్టులో రేడియో ధార్మిక పదార్థం లీక్... అధికారుల ఉరుకులు, పరుగులు
న్యూఢిల్లీ విమానాశ్రయంలో రేడియో ధార్మిక పదార్థాలు లీక్ కావడం కలకలం సృష్టించింది. ఇస్తాంబుల్ నుంచి దిగుమతైన వైద్య పరికరాల్లో ఈ లీకేజీ జరగడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆ వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ప్రత్యేక దుస్తులు ధరించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ లీకేజీ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని గుర్తించే పనిలో పడ్డారు. కాగా, ఇది చాలా స్వల్ప లీకేజీ అని, వివిధ రోగాల నిర్ధారణకు రేడియో ధార్మికతను నామమాత్రంగా వాడటం సహజమేనని అధికారులు వివరించారు. దీనివల్ల ప్రజలకు ఎటువంటి ప్రమాదమూ జరగబోదని అన్నారు.