: నిన్న గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం


నిన్న విశాఖపట్నంలోని జోడుగుళ్లపాలెం బీచ్ లో ముగ్గురు యువకులు గల్లంతైన విషయం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సముద్ర స్నానం చేస్తుండగా లోకేష్ (19), రాజు (18), విజయ్ (20) అనే యువకులను ఒక్కసారిగా వచ్చిన అల లాక్కెళ్లింది. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు ఈ ఉదయం బీచ్ ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మరో యువకుడి మృతదేహం లభించాల్సి ఉంది. చేతికి అంది వచ్చారనుకుంటున్న కుమారులు మృత్యువాత పడటంతో, వారి తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా ఉంది.

  • Loading...

More Telugu News