: మా నాన్న చాలా బాగున్నారు: ధర్మేంద్ర కుమార్తె ఇషా డియోల్
బలహీనత, భుజం నొప్పి కారణంగా ముంబయిలోని బ్రీచ్ క్యాండ్ ఆసుపత్రిలో చేరిన తన తండ్రి, సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె, నటి ఇషా డియోల్ స్పందించింది. తన తండ్రి ఫిట్ గా, చాలా బాగున్నారని ట్విట్టర్ లో తెలిపింది. "మా నాన్న చాలా బాగున్నారు. ఈ విషయంలో మా తండ్రి పట్ల ఆందోళన చెందిన అందరికీ ధన్యవాదాలు" అని ఇషా ట్వీట్ చేసింది. పూర్తి వైద్య పరీక్షల కోసమే ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరినట్టు ఇంతకుముందు వైద్యులు చెప్పారు.