: 'డిక్టేటర్'గా వస్తున్న బాలయ్య... 99వ చిత్రం షూటింగ్ ప్రారంభం
నందమూరి నటసింహం బాలయ్య 99వ చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఈ సినిమా పేరు 'డిక్టేటర్'. ఇటీవల 'లౌక్యం' హిట్ సినిమా తీసిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. డిక్టేటర్ కు సంబంధించిన ముహూర్తపు షాట్ ను రామానాయుడు స్టూడియోలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, మంచి కాంబినేషన్ లో ఈ సినిమా వస్తోందని అన్నారు. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందని... అభిమానుల అంచనాలకు చేరుకుంటుందని తెలిపారు. పాత రికార్డులను తిరగరాస్తుందని చెప్పారు. ఈ సినిమాలో అంజలి కథానాయికగా నటిస్తుండగా, తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.