: మందుబాబుల కోసం స్పెషల్ డ్రైవ్... దొరికిపోయిన 1000 మందికి కౌన్సెలింగ్
తాగినడిపే వారిపై కొరడాలు ఝుళిపిస్తున్న పోలీసులు ఈసారి బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై పడ్డారు. హైదరాబాదులో రాత్రిపూట మద్యం షాపుల ముందు పదుల సంఖ్యలో మందుబాబులు బహిరంగంగా తాగుతున్నారన్న ఫిర్యాదులు ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతుండడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి నార్త్, వెస్ట్, సౌత్ జోన్లలోని పోలీసు స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లపై బహిరంగంగా మందుకొడుతున్న వెయ్యి మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. మరోసారి ఇదే విధంగా మందుకొడుతూ దొరికిపోతే, కేసులు నమోదు చేస్తామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.