: రియోలో మరో పతకానికి గురిపెట్టిన బింద్రా
బ్రెజిల్ లోని రియో డీ జెనీరోలో 2016లో జరగనున్న రియో ఒలింపిక్స్ లో పతకానికి ఒలింపియన్ అభినవ్ సింగ్ బింద్రా గురిపెట్టాడు. పంజాబ్ కు చెందిన అభినవ్ బింద్రా ఎలాంటి అంచనాలు లేకుండా, గ్లాస్గో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. అలాంటి ప్రదర్శనను మరోసారి చేసి, చరిత్రను తిరగరాసే అవకాశం అభినవ్ బింద్రాకు లభించింది. భారత్ తరపున రియో ఒలింపిక్స్ లో పాల్గోనున్న నాలుగవ షూటర్ గా అభినవ్ బింద్రా అర్హత సాధించినట్టు ఇంటర్నేషనల్ షూటింగ్ ఫెడరేషన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. దీంతో అరుదైన అవకాశం సాధించిన షూటర్ గా బింద్రా నిలవనున్నాడు.