: ప్రపంచంలో తొలి హత్య జరిగింది ఎప్పుడో తెలుసా?


మానవజాతిలో జరిగిన పరిణామాలపై ఆసక్తి అందరికీ ఉంటుంది. అందునా హత్య వంటి సంచలన విషయాలపై మరింత ఆసక్తి కలగడం సహజం. అయితే తొలినాళ్లలో క్రూరమృగాల బారినపడి మరణించడమే కానీ, హత్యలు కూడా జరిగి ఉంటాయా? అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా జరిపిన పరిశోధనల్లో తొలి హత్యపై పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. 4.30 లక్షల ఏళ్ల కిందట ఒక మనిషి హత్యకు గురైన ఆనవాళ్లు స్పెయిన్ లోని సిమా డీ లాస్ హ్యూసన్ ప్రాంతంలోని ఒక గుహలో లభ్యమయ్యాయి. రోల్ఫ్ క్వామ్ అధ్యక్షతన ఏర్పాటైన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దాదాపు 20 ఏళ్లుగా ప్రపంచంలో చోటుచేసుకున్న తొలి హత్య గురించి పరిశోధనలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర స్పెయిన్ లోని గుహలో ఈ పుర్రె లభించిందని, పుర్రెతోపాటు 52 విడి భాగాలు కూడా లభ్యమయ్యాయని రోల్ఫ్ క్వామ్ తెలిపారు.

  • Loading...

More Telugu News