: మా పవర్ ఏంటో తెలుసు కాబట్టే వాళ్లు ఒక్కటయ్యారు: అమిత్ షా
బీహార్ రాజకీయ పరిణామాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేతులు కలపడాన్ని ప్రస్తావిస్తూ... "మా పవర్ ఏంటో వారికి తెలుసు కాబట్టే, పాతికేళ్లుగా పరస్పరం కత్తులు దూసుకున్న వారిద్దరూ ఏకమయ్యారు. ఇప్పుడు వారిది ఒకే వేదిక. అయినా, వారి కలయిక రాష్ట్రంలో బీజేపీకే లాభం చేకూరుస్తోంది" అని పేర్కొన్నారు. ప్రస్తుతం బీహార్ లో తమకు అనుకూల పవనాలు వీస్తున్నాయని అన్నారు.