: యూరోప్ పై దాడులు చేయం... అదంతా అమెరికా ప్రచారమే: ఆల్ ఖైదా
యూరప్ దేశాలపై దాడులు చేయాలన్న ఆలోచన తమకు లేదని సిరియాలోని ఆల్ ఖైదా శాఖ స్పష్టం చేసింది. యూరోపియన్ దేశాలపై దాడులు చేయడానికి తాము 'ఖొరసన్' గ్రూపును ఏర్పాటు చేశామన్న విషయాన్ని ఖండించింది. ఈ వదంతులన్నింటినీ అమెరికా సృష్టించిందని తెలిపింది. ఈ మేరకు అల్ జజీరా టీవీ చానెల్ కు సిరియా ఆల్ ఖైదా శాఖ 'సుస్రా ఫ్రంట్' అధినేత అబూ మొహమ్మద్ అల్-జొలానీ తెలిపాడు. ప్రస్తుతం డమాస్కస్ ను చేజిక్కించుకుని... ఆ దేశ అధ్యక్షుడు బషర్ అసద్ ను గద్దెదించడమే తమ ప్రథమ లక్ష్యమని చెప్పాడు.