: రాజస్థాన్ కు 4500 పారా మిలిటరీ బలగాల తరలింపు


తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్ లోని గుజ్జర్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. రోజులు గడుస్తున్నా వారు ఆందోళనలు విరమించడం లేదు. ఆందోళనల్లో భాగంగా వారు ముంబై-ఢిల్లీ రైలు మార్గాన్ని కూడా అడ్డుకుంటున్నారు. దీంతో ఇప్పటికే పశ్చిమ రైల్వేకి రూ. 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో, గుజ్జర్ల ఆందోళనలను ఎందుకు అదుపు చేయలేకపోయారంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో, శాంతిభద్రతలను అదుపులో ఉంచడం కోసం కేంద్ర హోం శాఖ చర్యలు చేపట్టింది. రాజస్థాన్ కు 4500 పారా మిలిటరీ బలగాలను తరలించింది.

  • Loading...

More Telugu News