: నిన్న అన్న కోసం... నేడు అమ్మ కోసం పర్యటిస్తున్న ప్రియాంక


గాంధీల కుటుంబం మొత్తం సొంత నియోజకవర్గాల పర్యటనలో మునిగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉన్న అమేథీని ఒకరి తరువాత ఒకరుగా రాహుల్, ప్రియాంక పర్యటించగా... ఇప్పుడు ప్రియాంక, సోనియా గాంధీలు రాయ్ బరేలీలో పర్యటిస్తున్నారు. రైతు భరోసా యాత్ర పేరిట రాహుల్ అమేథీలో పర్యటించి, ఎన్డీయేపై విమర్శలు చేయగా, తరువాత ప్రియాంక పర్యటించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీరును దుయ్యబట్టారు. వెంటనే ఆమె తల్లి నియోజకవర్గం రాయ్ బరేలీ చేరుకున్నారు. నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాయ్ బరేలీలో పర్యటించేందుకు చేరుకున్నారు. గత మార్చిలో జనతా ఎక్స్ ప్రెస్ పేలుడు బాధితులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఎంపీ లాడ్స్ నుంచి చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మొత్తానికి గాంధీల కుటుంబం మొత్తం ఒకే వారంలో పర్యటనకు పూనుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News