: ఇప్పుడు మీ చెత్తను కడుగుతున్నాం... మిమ్మల్ని కూడా కడిగే సమయం వస్తుంది: చంద్రబాబుపై జూపల్లి విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే అంటూ టీఎస్ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. నిజం చెప్పడం ఆయనకు అలవాటు లేదని ఎద్దేవా చేశారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదుతో పాటు, మొత్తం తెలంగాణ అంతటినీ తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకోవడం దారుణమని అన్నారు. అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా టీడీపీకి లేదని అన్నారు. ఇప్పటి వరకు తమరు చేసిన చెత్తను కడుగుతున్నాం... మిమ్మల్ని కూడా కడిగే పరిస్థితి వస్తుందని అన్నారు. హైదరాబాదు నుంచి పరిపాలన చేస్తుంటే, విదేశాల్లో ఉండి చేస్తున్నట్టుందని చంద్రబాబు వ్యాఖ్యానించారని... ఈ నేపథ్యంలో, టీటీడీపీ నేతలు ఇంకా ఆ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు.