: ఆ గ్లాస్ రోడ్డుమీద నడిస్తే...సవ్వడికనుగుణంగా సంగీతం


సాధారణంగా ఏ అర్ధ రాత్రి పూటో... ఎవరూ లేని ప్రదేశంలో... ఒంటరిగా నడిస్తే, మన అడుగుల శబ్దం మనల్నే భయపెడుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రోడ్డుపై నడిస్తే మాత్రం, మన అడుగుల కనుగుణమైన సంగీతం వినిపించి హుషారు తెప్పిస్తుంది. చైనాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం షినిజయ్ సెనిక్ స్పాట్ వద్ద 180,300 మీటర్ల ఎత్తులో కొండను ఆనుకుని, దాని చుట్టూ మ్యూజికల్ గ్లాస్ ప్లాంక్ పేరిట అద్దాల రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు మీద నడుస్తూ ఉంటే పాదాల కదలికకు అనుగుణంగా సవ్వడి వినిపిస్తుంది. సందర్శకులు తమ అడుగుల సవ్వడిని మార్చుకుంటూ సంగీతాన్ని ఎంజాయ్ చేసేందుకు ఇక్కడికి క్యూ కడుతున్నారు.

  • Loading...

More Telugu News