: కన్నతండ్రి కాదు...కాలనాగు
సమాజంలో విలువలు పతనమవుతున్నాయి. కాల ప్రభావమో లేక ఆలోచనల వైకల్యమో కానీ కన్న తండ్రులే ఆడతల్లుల పాలిట కాలనాగులుగా మారుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన కళ్ల ముందు నుంచి చెదిరిపోకముందే రాజస్థాన్ కోట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. పదవ తరగతి వరకు చదివి మానేసిన 16 ఏళ్ల బాలికపై, డ్రైవర్ గా పని చేస్తున్న కన్న తండ్రి ప్రమోద్ కుమార్ ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగు చూసింది. ఆ దారుణాన్ని భరించలేకపోయిన ఆ బాలిక నేరుగా పోలీసులను ఆశ్రయించింది. తనపై జరుగుతున్న ఈ దారుణం గురించి తల్లి, అన్నలకు తెలిపినా ఏమీ అనకపోవడం విశేషం. ఒంటరిగా కనిపిస్తే చాలు, తండ్రిలోని విషసర్పం పడగవిప్పేదని, ఎవరికైనా చెబితే తీవ్రపరిణామాలుంటాయని బెదిరించేవాడని బాలిక పోలీసులకు వివరించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను వైద్యపరీక్షలకు పంపి, నిందితుడిపై పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.