: ఖబడ్దార్ కేసీఆర్... టీడీపీ నీ సంగతి తేలుస్తుంది: ఎర్రబెల్లి


టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మహానాడు వేదికగా తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. తెలంగాణ కోసం తమ అధినేత చంద్రబాబు లేఖ రాస్తుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారు అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. అలాంటి తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ రెడ్ కార్పెట్ పరిచి, కేబినెట్ లో స్థానం కల్పించారని ఫైర్ అయ్యారు. తుమ్మల, తలసాని ఏనాడూ జై తెలంగాణ అనలేదని... రాష్ట్రం కోసం కడియం శ్రీహరి ఏనాడూ పోరాటం చేయలేదని ఆరోపించారు. దమ్ముంటే వీరిచేత రాజీనామా చేయించి, మళ్లీ గెలిపించుకోవాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. వారిని గెలిపిస్తే, వచ్చే మహానాడులో కేసీఆర్ కు సన్మానం చేస్తామని అన్నారు. కేవలం తన కుటుంబం కోసమే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారని మండిపడ్డారు. అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకారులను, మహిళలను, దళితులను కేసీఆర్ ఎప్పుడో మర్చిపోయారని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖబడ్దార్ కేసీఆర్... టీడీపీ నీ సంగతి తేలుస్తుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News