: విమానాల ఆలస్యానికి కారణమంటూ, 17 మంది ఎయిర్ హోస్టెస్ లను తొలగించిన ఏఐ
ఎయిర్ ఇండియా విమానాలు గల్ఫ్ దేశాలకు వెళితే చాలు... తిరిగి ఎప్పుడు బయలుదేరుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. సమయపాలన పాటిస్తూ, ప్రయాణికులకు సేవలు చెయ్యాల్సిన ఎయిర్ హోస్టెస్ లు విశ్రాంతి పేరిట గంటల తరబడి విమానాల ఆలస్యానికి కారణమవుతున్న ఉదంతాలను అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోని 17 మంది ఎయిర్ హోస్టెస్ లను సస్పెండ్ చేస్తూ, ఏఐ అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. ఓటీపీ (ఆన్ టైమ్ ప్రెజెన్స్) పాటించకుండా సంస్థను నష్టాలపాలు చేస్తున్నందునే వీరిని తొలగించామని వివరించారు.