: తెలంగాణ ఎంసెట్ లో ఆంధ్ర విద్యార్థుల ప్రభంజనం


తెలంగాణ ఎంసెట్ ఫలితాలను కాసేపటి క్రితం టీఎస్ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ పరీక్షల్లో ఆంధ్ర విద్యార్థులు సత్తా చాటడం ఆసక్తికరంగా మారింది. మెడిసిన్ విభాగంలో ప్రకాశం జిల్లా నాగులపాలెంకు చెందిన విద్యార్థిని ఉప్పలపాటి ప్రియాంక ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. మొత్తం 160 మార్కులకు గాను 160 మార్కులను ప్రియాంక సాధించింది. 4వ ర్యాంకును విశాఖకు చెందిన సాయితేజ, 6వ ర్యాంకును శ్రీకాకుళం జిల్లాకు చెందిన తేజేశ్వరరావు, 7వ ర్యాంకును రాజమండ్రికి చెందిన సత్యవరలక్ష్మి కైవసం చేసుకున్నారు. అలాగే, ఇంజినీరింగ్ విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి విద్యార్థిని కీర్తన మూడో ర్యాంకు సాధించింది. 160 మార్కులకు గాను 155 మార్కులను కీర్తన సాధించింది.

  • Loading...

More Telugu News