: గుజ్జర్లంటే అంత భయమేంటి?: రాజస్థాన్ డీజీపీకి హైకోర్టు అక్షింతలు


అప్రజాస్వామికంగా జరుగుతున్న గుజ్జర్ల ఆందోళనను ఎందుకు తీవ్రంగా తీసుకోవడం లేదని రాజస్థాన్ హైకోర్టు ఆగ్రహించింది. రాష్ట్రంలో రైలు, రోడ్డు రవాణా అతలాకుతలం అయినప్పటికీ, నిరసనకారుల్లో ఒక్కరంటే ఒక్కరినైనా ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ప్రశ్నించింది. వారంటే అంత భయమేంటని అడిగిన కోర్టు, ఈ విషయమై తక్షణమే స్పందించాలని రవాణా వ్యవస్థలను పునరుద్ధరించి రేపటిలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. గుజ్జర్ల ఆందోళన మూలంగా జరిగిన నష్టం వివరాలను తక్షణం కోర్టుకు అందించాలని ఆదేశించింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ, గుజ్జర్లు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరి నిరసనల కారణంగా రాజస్థాన్ గుండా ప్రయాణించాల్సిన వందలాది రైళ్లు రద్దయ్యాయి. రైల్వే వ్యవస్థకు రూ. 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

  • Loading...

More Telugu News