: తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో మరో పిల్
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) 29 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సిఫారసు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం ఎన్జీవోలకు 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం సరైన చర్య కాదని వరంగల్ జిల్లాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ తన పిటిషన్ లో పేర్కొంది. రైతులు అనేక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం, ఉద్యోగులకు మాత్రం రకరకాల రాయితీలు ఇస్తోందని ఆరోపించింది. వేతనాల పెంపు పీఆర్సీ సూచనల మేరకే జరగాలని విన్నవించింది. ఈ నేపథ్యంలో, హైకోర్టు ఎలా స్పందిస్తుందోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.