: ఎన్టీఆర్ కుమార్తెగా పుట్టడం నా అదృష్టం: పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీ నటుడు ఎన్టీఆర్ కూతురుగా పుట్టడం తన అదృష్టమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆ మహానటుడికి పురంధేశ్వరి దంపతులు నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో తాను కేంద్ర మంత్రిగా ఉన్నకాలంలో పార్లమెంట్ హాల్ లో తన తండ్రి విగ్రహం పెట్టించే అవకాశం తనకు లభించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం ముందడుగు వేస్తుందని అన్నారు.