: మైసూరు కొత్త రాజుకు నేడు పట్టాభిషేకం
23 సంవత్సరాల యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ కు నేడు మైసూరు రాజుగా పట్టాభిషేకం జరగనుంది. 1399 సంవత్సరంలో మొదలైన వడయార్ల పాలన అంతరించినప్పటికీ, మైసూరులో మాత్రం సంప్రదాయ రాచరిక వేడుకలు అంబా విలాస్ ప్యాలెస్ లో తరతరాలుగా వైభవంగా కొనసాగుతూనే ఉన్నాయి. యదువీర్ కు ముందు రాజుగా ఉన్న శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ 2013లో మరణించిన సంగతి తెలిసిందే. మైసూరు సంస్థానాల పాలన లేకపోయినా, ఇక్కడి ప్రజలు రాజకుటుంబీకులకు గౌరవం ఇస్తూ, అక్కడ జరిగే అన్ని తతంగాలనూ నిశితంగా గమనిస్తుంటారు. కాగా, నేటి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.