: నేను క్షేమం... స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నా: దరువు అంజన్న
ప్రజా గాయకుడు, ఓయూ జేఏసీ నేత దరువు అంజన్న అదృశ్యంపై బుధవారం తీవ్ర కలకలం రేగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాను క్షేమంగానే ఉన్నానంటూ ఉత్కంఠకు తెరదించారు అంజన్న. ఎమ్మెల్యే 'రసమయి' బాలకిషన్ చంపేస్తానని బెదిరించడంతో అజ్ఞాతంలోకి వెళ్లానని తెలిపారు. ప్రాణభయంతో ఓ మిత్రుడి ఇంట్లో తలదాచుకున్నట్టు తెలిపారు. అంజన్న అదృశ్యం విషయంలో నేడు హైడ్రామా నడిచింది. తన భర్త మంగళవారం రాత్రి నుంచి కనిపించడం లేదని అంజన్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు కూడా. అంతలోనే, తాను సేఫ్ అంటూ అంజన్న తెలిపారు.